జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం:- నాటు సారా (గుడుంబా) తయారీ విక్రయం చట్టరీత్యా నేరమని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ అన్నారు మండలం లోని కొప్పుల గ్రామంలో నాటు సారా రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు మండలంలోని కొప్పుల గ్రామ శివారులో గంగిరేణి గూడెం గ్రామానికి చెందిన అజ్మీర్ రాజు గుగులోతు రాజు నాటు సారా (గుడుంబా) తరలిస్తుండగా పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 100 లీటర్ల నాటు సారా (గుడుంబా) లభించిందన్నారు ద్విచక్ర వాహనాన్ని ఇరువురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై జక్కుల పరమేష్ తెలిపారు…