పయనించే సూర్యుడు అక్టోబర్ 12 బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణమహబూబ్నగర్
జిల్లా పోలీసు అధికారి శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు, డీఎస్పీ రమణారెడ్డి పర్యవేక్షణలో ఈ రోజు (12.10.2025) ఉదయం బాలానగర్ టౌన్లో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.ఈ తనిఖీలు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల లో భాగంగా, ప్రజల్లో భద్రతా నమ్మకాన్ని పెంపొందించడం, అనుమానాస్పద వాహనాలు మరియు వ్యక్తులను గుర్తించి నేరాలను అరికట్టడం లక్ష్యంగా చేపట్టబడ్డాయి.తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు:✔ సరైన పత్రాలు లేని 30 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నారు.✔ 06 ఆటో రిక్షా అనుమానాస్పదంగా ఉండడంతో ధృవీకరణ కోసం నిలిపివేశారు.✔ కొన్ని ఇళ్లలో అసాధారణ కదలికలు గమనించి మౌలిక సమాచారం సేకరించారు.✔ కాలనీలలో నివసిస్తున్న అనుమానాస్పద వ్యక్తుల వివరాలను ధృవీకరించారు.ఈ కార్యక్రమంలో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, బాలానగర్ ఎస్ఐ లెనిన్ ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు