జనం న్యూస్ 30 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా : డి.ఎస్.పి మొగులయ్య.ఒక టైం టేబుల్ తయారుచేసుకొని ప్రణాళికబద్దంగా చదవాలి.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పాఠశాల ఒక దేవాలయం లాంటిది గట్టు మండలం చాగదోన ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో…కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి చదివితేనే మన భవిష్యత్తు బాగుంటుందని డీఎస్పీ మొగులయ్య అన్నారు గట్టు మండల పరిధిలోని చాగదోన గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల లోని మాజీ ఎంపీపీ విజయకుమార్ అద్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పదో తరగతికి పరీక్షకు సంబంధించిన మెటీరియల్స్ కార్యక్రమం బుధవారం నాడు ఏర్పాటుచేసిన సమావేశానికి జోగులాంబ గద్వాల జిల్లా డీఎస్పీ మొగులయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతోపాటు మోటివేషనల్ స్పీకర్ ఉరుకుందుశెట్టి గట్టు ఎస్సై కేటీ మల్లేష్ పాల్గొన్నారు అనంతరం డిఎస్పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితేనే మనం బ్రతకగలమని ఆయన అన్నారు విద్య అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి కే కాదు భవిష్యత్తు ని నేర్పిస్తుంది ఆయన అన్నారు విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అని ఆయన అన్నారు ప్రతి విద్యార్థి ఒక ప్లాన్ చేసుకొని ప్రతిరోజు ఒక టైం టేబుల్ చేసుకోవాలని ఆయన అన్నారు వచ్చిన అవకాశాన్ని స్వదియోగం చేసుకోవాలని అన్నారు పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులపై ఉంటుందన్నారు చదువు అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి కాదు చదువు అనేది జీవితం అనేది నేర్పిస్తుంది పౌరుడిగా పౌరురాలుగా గొప్పగా మంచి చెడు తెలుస్తుంది కానీ పుస్తకం మొత్తాన్ని చదవాలి అప్పుడే దాంట్లోని మొత్తం మనకు తెలుస్తుంది అది ఏంటో ఒక పుస్తకం మొత్తం సముద్రం లాంటిదని పుస్తకం మొత్తం చదవాలి అప్పుడే దానిలోను ఉన్న ప్రశ్నకు జవాబు చెప్పడం గాని రాయడం గాని వస్తుంది ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా వాటిల్లో వస్తున్నాయి అలా కాకుండా మనం బట్టి పట్టి చదివితే అది అప్పటికి మాత్రమే ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు మనం చూస్తా ఉంటాం వేలవేల ఫీజుల్లో పట్టణాలలో కడుతుంటాం కానీ ఇలాంటి పాఠశాలలు ఎక్కడ చూడలేము ఇలాంటి వసతులు కూడా ఎక్కడ ఉండవు కానీ ఇప్పుడు విద్యార్థులు అదృష్టవంతులని ఇప్పుడు ఇలాంటి గొప్ప అవకాశం మీ పాఠశాలలో ఉన్నాయి అని ఆయన అన్నారు ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు 45 రోజులు మాత్రమే మనకు అవకాశంలే అందులోనే పది రోజులు మనం తీసేసుకుంటే 35 రోజులు మాత్రమే మిగులుతుంది ఒక్కొక్క సబ్జెక్టుకి ఐదు రోజులు సమయం ఉన్నది దాని ఒక రూపంగా ఏర్పాటు చేసుకొని మంచిగా చదువుకోవాలని ఆయన అన్నారు ఎంత చదివితే అంతా మంచి మార్కులు వస్తాయి కనుక ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల 30 నిమిషాలకు లేచి ప్రతిరోజు చదివితే ఏదన్నా సాధించవచ్చు అని ఆయన అన్నారు అంతేకాకుండా ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలకు 16 నుంచి 17 సంవత్సరాల కు సరికి చాలా చోట్ల మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి అంతేకాకుండా 16 సంవత్సరాలు వయసుకు వచ్చేపాటికి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రుల యొక్క బరువుని తీర్చుకోవాలని అనుకుంటున్నారు అలా కాకుండా వారిని మంచి చదివిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆయన తెలియజేశారు అంతేకాకుండా పాఠశాల సమయంలో ఎవరు కూడా పాఠశాలలోనికి ఇతరులు వెళ్ళకూడదు అలా వెళితే అక్కడున్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు అంతేకాకుండా ప్రతిరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో ఏదో ఒకచోట ఒకరికి ఇద్దరుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారు మందు తాగు లేకపోతే హెల్మెట్ ధరించకు ఇలా రోడ్డు ప్రమాదాలుగా గురవుతున్నారు కనుక ఒక ఇంటి యజమాని చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు రోడ్డున పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఎలిమెంట్ ధరించి డ్రైవింగ్ చేయాలని ఆయన సూచించారు అంతేకాకుండా విద్యార్థులు మంచిగా చదివి ఉన్న స్థాయికి ఎదిగితేనే ఒక గ్రామం ఒక మండలం కాకుండా విద్యార్థి తల్లిదండ్రులు పాటు విద్యను బోధించే ఉపాధ్యాయులు కూడా ఎంతో మంచి పేరు సాధించిన వారు అయితారని ఆయన తెలియజేశారు కనుక మనం చదివే ప్రతి ఒక్కటి ఒక గోల్ పెట్టుకొని చదివితేనే అప్పుడే మనం గోల్స్ సాధించగలమని ఆయన అన్నారు. కార్యక్రమంలోని గట్టు ఎస్సై కేటీ మల్లేష్ మాజీ సర్పంచులు శంకరన్న ఆంజనేయులు గౌడు షడ్రిక్ కే నర్సింలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మోహన్ రెడ్డి అయ్యా స్వామి గ్రామ పెద్దలు శివప్ప గూరన్న సునందు ఈ తిరుమల గౌడ్ నర్సింలు సు దండోరా ఉపాధ్యక్షుడు తిమ్మన్న దేవన్న వీరన్న కే నర్సింలు వేమారెడ్డి రామచంద్ర గౌడ్ జయరాం గౌడ్ బసన్ గౌడు పుల్లయ్య బజారి వడ్డే నాగన్న భాస్కర్ ప్రవీణ్ సుదర్శన్ అశోక్ రాజు, మధుకర్ కే ఉరుకుందు గ్రామ యువకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు
🎤 మోటివేషనల్ స్పీకర్ ఉరుకుందు శెట్టి మాట్లాడుతూ…
Exam MANTRA (సక్సెస్ మంత్ర) గురించి వివరించారు…!!
MINDSET ను సానుకూల దృక్పథం కలిగి ఉండాలని…
Avoid Attraction మొబైల్,టీవీ లకు దూరంగా ఉండాలని, అతినిద్ర,వాయిదావేయడం,బద్దకం,నెగెటివ్ థింకింగ్ వదిలేయాలని…
Notes Preparation చేసుకోవాలని…
Time Management ను నిర్వర్తిస్తూ, REVISION చేయాలని సూచించారు