జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు లందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలి అని ఆయన అన్నారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిన్నా పిల్లలకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ చిన్న పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాయి కృష్ణ చలపతి ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఆశ వర్కర్ లు మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….