జనంన్యూస్. 13.నిజామాబాదు.
శిక్షణార్థులకు సౌకర్యాలు మెరుగుపరచాలని ఆదేశాలు.
నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీసు శిక్షణ కేంద్రమును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాబోయే శిక్షణార్థులకు అనుకూలంగా ఉండే విధంగా అవసరమైన సౌకర్యాలు , వసతులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.పోలీస్ శిక్షణ సెంటర్ అనేది భవిష్యత్ పోలీస్ అధికారుల పాత్రను తీర్చిదిద్దే కేంద్రం. ఇక్కడ శిక్షణ పొందేవారికి శారీరక , మానసిక అభివృద్ధి జరిగేలా వాతావరణం ఉండాలి. తగిన వసతులు , శిక్షణా పరికరాలు , మరియు శిక్షకులు అందుబాటులో ఉండేలా చూడాలి" అని పేర్కొన్నారు.సెంటర్లో వసతులు , ట్రైనింగ్ సెంటర్ గదులు , వంటశాల , నీటి సరఫరా , శౌచాలయాలు , ఇండోర్ తరగతి గదులు , అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ తదితర అంశాలను పరిశీలించిన ఆయన , తక్షణమే కొంతమేర మెరుగుదలలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా బోధన్ ఏసిపి శ్రీనివాస్ , బోధన్ రూరల్ సి.ఐ విజయ్ బాబు , ఎడపల్లి ఎస్సై ఎమ్. రమ మరియు ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది