జనం న్యూస్ అక్టోబర్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కాంగ్రెస్ పార్టీని సంస్థ గతంగా అంకితభావంతో బలోపేతం చేసే వారికి హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు హనుమకొండలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన జిల్లా అధ్యక్ష ఎంపిక కోసం నిర్వహించిన సమావేశంలో ఎన్నికల పరిశీలకులు నవ జ్యోతి పట్నాయక్ మండలాల వారి గా కాంగ్రెస్ నాయకులతో అధ్యక్ష ఎన్నిక గురించి అభిప్రాయ సేకరణ చేయడం జరిగినది ఈ సందర్భంగా కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగినది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు వాసవి చంద్రప్రకాష్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి మారేపల్లి రవీందర్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి దుబాసి కృష్ణమూర్తి వైనాల కుమారస్వామి చిందం రవి అబ్బు ప్రకాష్ రెడ్డి డిటి రెడ్డి సాధు నాగరాజు తదితరులు పాల్గొన్నారు…..