జనం న్యూస్ 13 అక్టోబర్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి తు కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ రిమెళ్ళ శంకర్)
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రామ్ నరసింహ, మరియు సతీష్ నేతృత్వంలో ఘనంగా జరిగిన ఉత్తమ బతుకమ్మ పోటీల విజేతల అవార్డుల ప్రధాన కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ పసుపులేటి వీరబాబు, జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ గొల్లపల్లి దయానంద రావు,
సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి శ్రీ ఎస్ కే సాబీర్ పాషా, కొత్తగూడెం క్లబ్ సెక్రటరీ లయన్ శ్రీ కోనేరు పూర్ణచందర్రావు, వసుంధర సుమంగళి అధినేత శ్రీ తాటిపల్లి శంకర్ బాబు ,కామాక్షి గిఫ్ట్ ఆర్టికల్స్ అధినేతలు దసారి శ్రీనివాస్ మరియు దసారి రాజేశ్వరిలు పాల్గొన్నారు.సభాధ్యక్షులుగా కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ వ్యవహరించారు.అపరబాలు అల్లి శంకర్ మరియు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్‌లు చక్కని గీతాలను ఆలపించి అలరించారు.కొంతమంది చిన్నారి విద్యార్థులు గాంధీ తాత తెలంగాణ తల్లి, నడిచి వచ్చే బతుకమ్మ, కాళోజి మరియు పోతురాజు వేషధారణలో వచ్చి అందరిని అలరించారు. ఈ సందర్భంగా అపరబాలు అల్లి శంకర్ ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ పాట వీడియో అందరిని అలరించింది.
ఈ సందర్భంగా ముఖ్య గౌరవ అతిథులు మాట్లాడుతూ ఈ బతుకమ్మ పండుగ అనేది మహిళలందరికీ ఎంతో ఆనందదాయకమైన ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగించే పండుగని ప్రభుత్వం కూడా ఈ పండుగ పట్ల ఎంతో ఘనమైన సౌకర్యాలను మహిళలకు కల్పించిందని, బతుకమ్మ పండుగ యొక్క ప్రాధాన్యతను ప్రాశస్త్యన్ని వివరిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన రామ్ నరసింహ మరియు సతీష్ లు అభినందనీయులని ప్రశంసించారు. విజేతలకు బహుమతులను వసుంధర షాపింగ్ మాల్ , శ్రీ కామాక్షి గిఫ్ట్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ ఫాన్సీ షాప్ , పూర్ణ మొబైల్స్, ఆకునూరి, సుప్రియ, కాపు కృష్ణ ఫైర్ వర్క్స్ టపాసుల షాప్ , డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు లు ఓజి ఫ్యాషన్స్ . వరునిక సెలబ్రేషన్స్ శేఖర్ సహకరించారు .ఈ కార్యక్రమంలో అతిథులుగా సింగరేణి సేవ సమితి సెక్రటరీ శ్రీమతి మునిల, దిశా కమిటీ సభ్యురాలు శ్రీమతి రెంటపల్లి మాధవి లత, ఎన్ కె నగర్ మాజీ సర్పంచ్ శ్రీమతి సన, గాంధీ పదం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చింతలచెరువు, గిరీశం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు భూపతి శ్రీనివాస్, ఆకునూరి సుప్రియ తదితరులు పాల్గొన్నారు.