జనం న్యూస్ 13 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు కండువా కప్పి ఆహ్వానం పలికిన ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ ఈరోజు హైదరాబాద్ లోని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ నివాసంలో అలంపూర్ నియోజక వర్గం అయిజ మండలానికి చెందిన పలువురు బి ఆర్ ఎస్ నాయకులు. బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు భూంపురం నరసింహ రెడ్డి ,ఉప్పల తిప్పన్న, లు మరియు కురువ రమేష్ మాజీ టెంపుల్ డైరెక్టర్,రంగన్న గౌడ్ ముగినుపల్లి మాజీ సర్పంచి,కురువ నాగేద్ర , బోయ ఆంజనేయులు ,నాగేంద్ర, అంజి,దాసప్ప తిమ్మప్ప, కురవ భీమన్న, కురవ భీమేశ్ తదితరులు బిఆర్ఎస్ పార్టీని వదిలి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వారికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు . ఈ కార్యక్రమంలోఅలంపూర్ మార్కేట్ కమిటీ చైర్మెన్ దొడ్డప్ప కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ గౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, తదితరులు పాల్గొన్నారు .స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు.