జుక్కల్ అక్టోబర్ 13 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోలా గారికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమయిందని..పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు..జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు..డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, నాయకుల, కార్యకర్తల యొక్క అభిప్రాయాలను మరియు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని సహకరించాలని కోరారు..స్థానిక నాయకుల, కార్యకర్తల యొక్క అభిప్రాయాలను అధిష్టానానికి పంపి డీసీసీ పదవికి సిఫారసు చేయడం రుగుతుందని అన్నారు..పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షుడి నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు.పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ నాయకత్వాన్ని కార్యకర్తల ద్వారానే ఎంపిక చేయడం, పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఒక మంచి ప్రక్రియ అని అన్నారు.. ఈ విధానం ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేయడం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలపడటానికి దోహదం చేస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు..