జనం న్యూస్ అక్టోబర్ 13 నడిగూడెం మండల
కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో 2025 -26 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ప్రభుత్వం అందించిన ఒక కార్పెటు, దుప్పటి చొప్పున 116 మంది విద్యార్థినీలకు సోమవారం వసతి గృహం వార్డెన్ లతీమూన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల విద్య పట్ల తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, విద్యార్థులకు కాస్మోటిక్, మెనూ ఛార్జింగ్ కూడా పెంచిందని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది మాధవి విద్యార్థినిలు పాల్గొన్నారు.