జనం న్యూస్ అక్టోబర్ 14 సంగారెడ్డి జిల్లా
పటాన్ చేరు నియోజక వర్గం జిన్నారం మండల పరిధిలోని మండల విద్యా కార్యాలయంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి (ఎంఈఓ) కుమారస్వామి ఆధ్వర్యంలో 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని కాంప్లెక్స్ హెడ్మాస్టర్స్ విజయ్ కుమార్, కవిత, మృదుల పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు అనిల్ కుమార్, ఉమాదేవి, రామచందర్, ప్రదీప్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని, విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని ఎంఈఓ కుమారస్వామీ పేర్కొన్నారు.