నందలూరు మండలంలో రైల్వే పరంగా ముఖ్యమైన సమస్యలను నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ నెంబర్ రాచూరి మురళి మంగళవారం నాడు గుంటకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ చంద్రశేఖర్ గుప్తా గారిని మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీ ఎన్ మనోజ్ గారిని కలిసి వారితో గతంలో కోవిడ్ 19 సమయం కన్నా ముందున నిలబడే ప్రతి ఒక్క రైలు నిలుపుదల ఇవ్వవలసినదిగా మరియు రైల్వే స్టేషన్ వద్ద నిర్మిస్తున్నటువంటి నూతన అండర్ సబ్ వే లో పాదాచారులకు ఫుట్ పాత్ నిర్మించలేదు కనుక దానికి పరిష్కారం చూపవలెనని అలాగే రైల్వే కమ్యూనిటీ హాల్ నందు ప్రతి సంవత్సరము వందల సంఖ్యలో ముఖ్యమైనటువంటి కళ్యాణాలు మరియు వివిధ ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ రైల్వే కమ్యూనిటీ హాల్ యందు సరియైన వసతులు లేవు కనుక మీరు రైల్వే కమ్యూనిటీ హాల్ ని ఎయిర్ కండిషన్ చేసి సౌకర్యాలు కల్పించవలసిందిగా మరియు నందలూరు మండలంలోని చాలామంది కార్తిక మాసంలోని అయ్యప్ప భక్తులు శబరిమలై కి పోతూ ఉంటారు వారికి స్పెషల్ ట్రైన్లు నందలూరులో నిలుపుదల చేయవలసినదిగా మరియు నందలూరులోని వందల ఎకరాల రైల్వే స్థలాన్ని రైల్వే అవసరాలకు ఉపయోగించుకోవలసినదిగా మరియు మరియు మండలంలోని చిన్న పిల్లలు యువతకు రైల్వే క్రీడా మైదానాన్ని నిర్మించి దానిని అభివృద్ధి చేయాలని కోరడం జరిగినది దీనికి స్పందించినటువంటి అధికారులు ట్రైన్లు స్టాపింగ్ యొక్క సమస్యలను అప్రోలింగ్ పరిశీలనలో ఉన్నవని అలాగే అండర్ గ్రౌండ్ సబ్ వే ఫుట్పాత్ కొరకు వెంటనే తగు చర్యలు చేపడతామని శబరిమల స్పెషల్ ట్రైన్స్ నందలూరులో స్టాపింగ్ ఇస్తామని మరియు రైల్వే కమ్యూనిటీ హాల్ ని ప్రైవేటీకరణ టెండర్ల రూపంలో నిర్వహించి ఆధునీకరణ ఖచ్చితంగా చేస్తామని తెలియజేయడం జరిగినది మరియు చిన్నపిల్లలు యువకులక కొరకు క్రీడా మైదానాల గురించి అధికారుల మీటింగ్ సమావేశాలలో చర్చించి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేయడం జరిగినది.