జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం లో మా యంగ్ మెన్స్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 11 12వ తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన సౌత్ ఇండియా స్థాయి క్యారమ్స్ పోటీల్లో, డబుల్స్ కేటగిరీలో తమిళనాడు జట్టు విజయం సాధించడం జరిగింది,వారికి 40 వేల రూపాయల నగదును కమిటీ వారు ఇవ్వడం జరిగింది.రన్నర్స్ గా మరో తమిళనాడు జట్టు కి 25 వేల రూపాయల నగదును ఇవ్వడం జరిగింది.సింగిల్స్ కేటగిరీలో మొదటి బహుమతి 25వేల రూపాయలను కేరళకు చెందిన నసీర్ కు ఇవ్వడం జరిగింది మరియు రన్నర్స్ గా గుంతకల్ కు చెందిన పవన్ కు 15 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.అలాగే సెమీఫైనల్ లో ఓడిపోయిన క్రీడాకారులకు మరియు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన క్రీడాకారులకు కూడా నగదు బహుమతిని అందజేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో యంగ్ మెన్స్ క్యారమ్స్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు బియన్ శంకర్, కమిటీ సభ్యులు విశ్వనాథ్, గ్రీష్మంత్ రెడ్డి, నాగభూషణం, సుధాకర్, హరి ప్రసాద్, నారాయణ,సామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.