జనం న్యూస్ అక్టోబర్ 14 నడిగూడెం
మండల క్లస్టర్ పరిధిలోని నడిగూడెం, సిరిపురం, రత్నవరం రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు యాసంగిలో పప్పులు, నూనె గింజల సాగుపై, పశు పోషణ పై రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు పిచ్చయ్య, రేణుక, గాయత్రి, రైతులు పాల్గొన్నారు.