జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నందు విపత్తులు వరదలు వంటి సమయాలలో యువత ఏ విధమైనటువంటి విధానాలను అవలంబించాలి ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అనే వాటిపై ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ కె ఎస్ వి ఎన్ మనోహర్ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది బి శ్రీనివాస్ వై వరప్రసాద్ మై భారత్ వాలంటీర్ సరోజిని పాల్గొన్నారు.