వారం రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఖాళీ బిందెలతో కాలనీవాసుల నిరసన
జనం న్యూస్- అక్టోబర్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లో పలు వార్డులలో గత వారం రోజుల నుంచి మంచినీటి సరఫరా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. చెంతనే కృష్ణానది ఉన్న నందికొండ వాసులకు ప్రతిరోజు మంచినీటి సరఫరా జరగక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తరచూ నీటి సరఫరా చేసే మోటర్లు రిపేరు కారణంగా కాలనీవాసులకు నీటి సరఫరాలో జాప్యం జరుగుతుంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో మోటర్లు తరచూ రిపేర్లు వస్తున్నాయి అంటూ బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి స్థానిక ప్రజలతో కలిసి నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రధాన రహదారిపై కాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజుల నుండి మంచినీటి సరఫరా లేక ప్రజలు అవస్థలు పడుతున్న ఎన్ఎస్పి అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఎన్ఎస్పి అధికారులు స్పందించి మోటర్లు రిపేర్ చేయించి వెంటనే తాగునీటిని సరఫరా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సపావత్ చంద్రమౌళి నాయక్, గుజ్జుల కొండలు, నకిరేకంటి సైదులు, మున్సూర్, కోట్ల సైదులు, యూసుఫ్, అంజయ్య, రాముల నాయక్, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, లక్ష్మణ్ నాయక్, సిద్దయ్య, కోదండ, తిమ్ములు, వెంకటేశ్వర్లు, రషీద్, కృష్ణ, సైదాబీ, వీణ బాయ్, అరుణ, సులోచన, పద్మ, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.