జనం న్యూస్ అక్టోబర్ 14 నడిగూడెం
ఎంఎస్పి మండల అధ్యక్షుడు మోషయ్య మృతి బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చాకిరాల గ్రామంలోని మోషయ్య నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరముల ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో సాధించిన ఎస్సీ వర్గీకరణ సామాజిక పోరాడాలలో మోషయ్య పాత్ర మరవలేనిదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి సూర్యాపేట అనుబంధ సంఘాల జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి రాజు మాదిగ ,ఎమ్మెస్పి రాష్ట్ర నాయకులు యలమర్తి రాము,ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ పందీంటి నవీన్ కుమార్ మాదిగ,ఎమ్మెస్పి జిల్లా నాయకులు బచ్చలకూరి వెంకన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ నడిగూడెం మండల అధ్యక్షులు మోలుగూరి సైదులు, ఎమ్మార్పీఎస్ నడిగూడెం మండల అధికార ప్రతినిధి కంభంపాటి సోమయ్య, ఎంఎస్పి మునగాల మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను, ఎమ్మార్పీఎస్ కోదాడ మండల నాయకులు సోమపంగు అశోక్, ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు, ఎంఎస్పి అనంతగిరి మండల అధ్యక్షులు ఆకారపు కొండలు, ఎమ్మార్పీఎస్ మోతే మండల అధ్యక్షులు బైరపొగు విజయ్, ఎమ్మెస్పి మోతే మండల అధ్యక్షులు బోర్ర సునీల్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాతకోట్ల నాగేశ్వరరావు, నడిగూడెం పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దున్న వంశీ,కలకొండ సాల్మన్, సైదిబాబు, వీరయ్య, ఫిరోజ్, కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు…