జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలం తొర్థి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న వివాదం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అట్రాసిటీ కేసు నడుస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా పోలీసులు పికెటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ పాడాల రాజేశ్వర మాట్లాడుతూ — “గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎవరూ చట్టం చేతుల్లోకి తీసుకోరాదు. ఎవరి భావోద్వేగాలకు లోనై కలహాలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు ప్రశాంతంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.