జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాల నాయకులు మధ్యాహ్నం 2:00 గంటలకు బాల్కొండ మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో సమావేశం కానున్నది.బ్లాక్–B పరిధిలోని భీంగల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల నాయకులు సాయంత్రం 5:00 గంటలకు మోర్తాడ్ ప్రజా నిలయంలో సమావేశమవుతారని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు.ఈ సమావేశాలుకు బూత్ ఇంచార్జ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.అలాగే, ఈ సమావేశాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు రిజ్వాన్ అర్షిద్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు పారిజాత నరసింహారెడ్డి, ఆరేపల్లి మోహన్ గారు కూడా హాజరుకనున్నారు. వారితో నాయకులు వన్ టు వన్ చర్చలు జరపనున్నారు అని మాట్లాడారు.