జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 15 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్లో ప్రముఖ డాక్టరు లావు సుష్మ ఆధ్వర్యంలో ఇటీవల ఒక క్లిష్టమైన కేసులో అత్యవసర శస్త్రచికిత్స (Lscs) విజయవంతమైంది. PPROM (Preterm Premature Rupture of Membranes) తో బాధపడుతున్న ఒక గర్భిణీ స్త్రీకి డాక్టరు లావు సుష్మ బృందం అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు.ఈ శస్త్రచికిత్స ద్వారా 2.5 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన మగ శిశువు జన్మించాడు. తల్లి మరియు శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారికి అవసరమైన ప్రత్యేక సంరక్షణ అందిస్తున్నామని హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి.తల్లికి ఉన్న PPROM వంటి అత్యవసర స్థితిలో, శిశువుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా, సరైన సమయంలో డాక్టరు లావు సుష్మ తీసుకున్న నిర్ణయం, ఆపరేషన్ నిర్వహణలో ఆమె నైపుణ్యం వల్లే ఈ ఆపరేషన్ విజయవంతమైందని రోగి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టరు లావు సుష్మ మరియు లీలావతి హాస్పిటల్స్ బృందాన్ని పలువురు అభినందించారు.