
అక్టోబర్15 (జనంన్యూస్)
మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట మండల పరిధిలోని మడూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్,పద్మశాలి ముద్దుబిడ్డ గంగుల రమేష్ బుధవారం ఉదయం మరణించాడు.ఆయన మడూర్ గ్రామ యువజన సంఘం అధ్యక్షులుగా, విద్యావాలంటరీగా తమ సేవలందించారు.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు.అనంతరం ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మాజీ ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు.ఆయన మృతి పట్ల చిన్నశంకరంపేట మండల పద్మశాలి సంఘం తరపున శ్రద్ధాంజలి గటిస్తున్నట్లు నాయకులు వనం నర్సింలు, మండలద్యక్షులు తలకొక్కుల శ్రీనివాస్,ముదిగొండ శివకుమార్, బైoడ్ల బాలరాజు, వై.కిష్టయ్య, ఉడుత శ్రీమన్నారాయణ, పద్మశాలి సంఘం నాయకులు సంతాపం తెలిపారు.