
జనం న్యూస్ అక్టోబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోవైపు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ అహర్నిశలు 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీని మార్పులు చేయించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గూగుల్ డేటా సెంటర్ ₹1,33 కొట్లు పెట్టుబడి పెట్టే గూగుల్ క్లౌడ్ సంస్థ ద్వారా 2 లక్షల మందికి ఉపాధి కల్పించే సంస్థతో ఢిల్లీలో ఎంవోయు కుదుర్చుకున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం ప్రకటించారు. ముందుగా బాణాసంచా జివ్వలు బాంబులు వెలిగించి కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు నాయకులకు పంపిణీ చేసిన అనంతరం నాగ జగదీష్ మాట్లాడుతూ దేశంలోనే 15 బిలియన్ డాలర్ల ఎఫ్ డి ఐ ఇదే తొలిసారి అని, అభివృద్ధి వికేంద్రీకరణ మాటలకే పరిమితం చేయకుండా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని నాగ జగదీష్ అన్నారు. ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ వైపే చూస్తుందని, నాడు హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ నేడు విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ సంస్థ తో మన ప్రభుత్వం ఒప్పందం శుభపరిణామని, ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్దది, దేశంలోనే తొలి ఏఐ హబ్ ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతుందని, ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బోలోపేతం కావడంతో పాటు వ్యవసాయం వైద్యo విద్యరంగాలు మెరుగుపడతాయని నాగ జగదీష్ అన్నారు. ఈ సెంటర్ ద్వారా 12 దేశాలకు నేరుగా కంప్యూటర్ డేటా పంపేందుకు, బ్రాడ్ బ్యాండ్ వేగాన్ని పెంచేందుకు సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనున్నారని నాగ జగదీష్ అన్నారు. ఈ సబ్ సీ కేబుల్ నెట్ వర్క్ ను అంతర్జాతీయ నెట్ వర్క్ కనెక్ట్ చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలోని డిజిటల్ ఆధారిత వ్యవస్థలకు గూగుల్ అనుసంధానం చేయనున్నదని, దీంతో అంతర్జాతీయ స్థాయిలో కనెక్టివ్ కేంద్రంగా మారనున్నదని నాగ జగదీష్ అన్నారు. ఈ హబ్ లోని ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జిమెయిల్, యాడ్స్, క్లౌడ్ వంటి ఇతర గూగుల్ సేవలో విశాఖ నుంచి ప్రపంచానికి అందించబడునున్నాయని, దేశం మొత్తం గర్వించే సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తుంటే వైసిపి నేతలు స్వాగతించకుండా గూగుల్ క్లౌడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి, ఆ సంస్థపై కూడా తప్పుడు ప్రచారం చేసేందుకు రామకృష్ణ కుట్రలు చేయడం దుర్మార్గమని నాగ జగదీష్ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ కాండ్రేగుల సత్యనారాయణ బోడి వెంకటరావు కర్రి గోపి షేక్ ఖాదర్ పిళ్ళా తారకేసు కర్రి మల్లేశ్వరరావు చదరం శివ అప్పారావు బొడ్డేడ దేవయ్య సాలాపు నాయుడు శ్రీకాకుళం గణపతి రేబాక ఈశ్వర అప్పారావు పోలమరశెట్టి సూరిబాబు రేఖా రమణమూర్తి కాండ్రేగుల రవీంద్ర బొడ్డేడ నూకరాజు మహిళా నాయకులు వేదుల సూర్యప్రభ శంకర్ల పద్మలత భీశెట్టి హేమ కూరాకుల భారతి తదితరులు పాల్గొన్నారు.