
జనంన్యూస్. 15.నిజామాబాదు.ప్రతినిధి.
అసలే వర్షాకాలం సీజన్ వరి కోతలు ధాన్యం ప్రారంభమై ఇప్పటికే 20 రోజులకు పైనే అవుతుందని యుద్ధ ప్రతిపాదికన వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లను తరలించాలని . చెడగొట్ల వర్షాల వలన రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నదని కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఈరోజు తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్ ను తెలంగాణ కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి. మరియు తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు జయశ్రీ పాల్గొన్నారు.