అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రీ సత్యదేవ రధం టూర్ ప్రోగ్రామ్ ఇంచార్జి తాటిపాక రాంజీ, ఆలయ అర్చకులు నరసింహ మూర్తి లను మరియు సత్తి బాలకృష్ణ సహకారాలతో అన్నవరం ప్రసాదం తెచ్చి ఉన్నారుశ్రీ రమా వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి పంచాయతన క్షేత్రం( సవరప్పాలెం) ఆలయ కమిటీ పెద్దలు,ఆలయ అర్చకులు వీర వెంకట సత్యనారాయణ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారికి స్వామివారి ఖండువాలు వేసి వేదఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు గ్రామ పెద్దలు రధం దగ్గరికి వచ్చి దర్శించుకున్నారు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంతో గ్రామస్తులు దర్శించుకున్నారు