జనం న్యూస్ అక్టోబర్ 15 నడిగూడెం
గ్రామాల్లో పశువుల కొరకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నడిగూడెం పశు వైద్యాధికారి డాక్టర్ అఖిల కోరారు. బుధవారం మండలంలోని బృందావనపురం, సిరిపురం, తెల్లబెల్లి గ్రామాలలో ఆవులకు, గేదెలకు గాలికుంటు టీకాలను వేశారు. బృందావనపురములో ఆవులు 2, గేదెలు 47, సిరిపురం లో గేదెలు 72, తెల్లబల్లి లో ఆవులు 8, గేదెలు 78 లకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.