పోలీసుల అమరవీరుల త్యాగమే సమాజానికి ప్రేరణ కలగాలి -ఎస్సై పడాల రాజేశ్వర్
జనం న్యూస్ అక్టోబర్ 15:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న పోలీసు స్టేషన్ లో బుదవారం రోజునా పోలీసు శాఖ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం పోరాడిన అమర వీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 15 నుండి 21 వరకు “పోలీస్ అమరవీరుల వారోత్సవం”ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఎస్సై పడాల రాజేశ్వర్ మాట్లాడుతూపోలీసుల సేవల ప్రాముఖ్యత, సమాజంలో వారి పాత్రను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఫ్రెండ్లీ పోలీస్ టాక్‌లో రీస్పాన్స్ టీమ్, సీసీ టీమ్, కంట్రోల్ రూమ్ విధులను పరిచయం చేశారు. సైబర్ క్రైమ్, డయల్ 100/112 సేవలు, షీ టీమ్స్, బరోసా సెంటర్ వివరాలను తెలియజేశారు. ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను కూడా వివరించారు.విద్యార్థుల ప్రశ్నలకు పోలీసూధికారులు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె . కృష్ణామా చారి, ఉపాధ్యాయులతో పాటు దాదాపు 100 మంది విద్యార్థులు, తదితరులు హాజరైనారు.