జనం న్యూస్ తర్లుపాడు మండలం జనవరి30:- తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లెలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.జగన్ మాట్లాడుతూ
1869లో గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించినటువంటి మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ , అమ్మ పేరు పుత్లి బాయ్. ఆయన విద్యాభ్యాసం పోరు బందర్ మరియు రాజ్‌కోట్ లో జరిగింది. ఆ తర్వాత లా కోర్స్ చేయడానికి లండన్ వెళ్లి, న్యాయ శాస్త్రాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి బొంబాయి మరియు రాజ్‌కోట్ లో లాయర్‌గా 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఒక సంవత్సరం దక్షిణాఫ్రికా వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళాక మొత్తంగా 21 సంవత్సరాలు అక్కడ పని చేశారు . అక్కడ తెల్ల జాతి వాళ్ళు జాతి వివక్ష,అహంకారంతో ఆయన ని ఎన్నో అవమానాలకు గురి చేశారు. అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకొని పోరాట పటిమ అలవర్చుకున్నారు .ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ఇలా ఎన్నో ఉద్యమాలు అహింస మార్గంలో చేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల్లో అగ్రగామి గా ఉన్నాడు. ఆయన ఎంచుకున్న మార్గం సత్యం, అహింస మార్గం . ఆయన ఎంచుకున్న మార్గం ఆయన విధానాలను గమనించిన వ్యక్తులందరూ ఆయనను మహాత్ముడు అని సంబోధించేవారు .ఇంకా కొంతమంది జాతిపిత అని సంబోధించేవారు. అలాంటి గొప్ప వ్యక్తి వర్ధంతి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకోవడం గర్వకారణం. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు స్కూల్ ఆవరణలో మొక్కలను నాటడం జరిగింది. ఆ తదుపరి విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్ అబ్దుల్ షూకూర్ పాల్గొన్నారు.