జనం న్యూస్ -జనవరి 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు గడుస్తున్న ఎన్నికల హామీలు అయినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని, తక్షణమే ఎన్నికల హామీలలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలియజేశారు, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి ,చంద్రమౌళి నాయక్, శేఖర్ చారి ,మన్సూర్, పిట్ట సైదులు, చంద్రయ్య, షరీఫ్ బాబా, నజీర్, కందగట్ల వీరయ్య, కోట్ల సైదులు, సాగర్, లక్ష్మణ్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు