మహత్మా గాంధీ జీవితం ప్రతి తరానికి స్ఫూర్తి దాయకం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం జాతిపిత మహాత్మా గాంధీ జీవితం, ఆదర్శాలు ప్రతి తరానికి స్పూర్తినిస్తాయని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలసి, ఆయన చిత్రపటానికి మాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ...సత్యం, అహింసలే ఆయుధంగా గాంధీ స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారని, జాతిపిత మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిందం రవి ప్రపంచ రెడ్డి రాజు రాజేందర్ కట్టయ్య వీరన్న వాల్పదాసు రాము లింగమూర్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.....