అచ్యుతాపురం(జనం న్యూస్):సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్ర సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా అచ్యుతాపురం సర్పంచ్ కూండ్రపు విమలా నాయుడు మరియు నాయకులు ఆ మహనీయునికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అహింస అనే ఆయుధంతో సూర్యడస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాత దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డి నాయుడుబాబు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.