అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏటికొప్పాక హస్త కళాకారుడు సంతోష్ ను ఎమ్మెల్యే విజయ్ కుమార్ సత్కరించారు.
ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం పై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గంలో గల
ఏటికొప్పాక కళాకారుడు సంతోష్ రూపొందించిన లక్క బొమ్మల శకటానికి తృతీయ బహుమతి దక్కడం పట్ల ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో 30 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంతోష్ ను ఎమ్మెల్యే అభినందించారు.