భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు
-శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించినదే ఈ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం
జనం న్యూస్, జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
దక్షణ కాశీగా విరాజిల్లుతున్న కూడెల్లివాగు సమీపనా వెలిసిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. అందుకే రామలింగేశ్వర క్షేత్రంగా పిలుస్తున్నారన్నారు. అనంతరం రామకోటి రామరాజును దేవాలయం, ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆచార్య సాకేత్ శర్మ పాల్గొన్నారు.