
జనం న్యూస్ అక్టోబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నకాటేరు వద్ద బస్సు అగ్ని ప్రమాద ఘటనపైఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ వి ప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు( బుచ్చిబాబు) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఈ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పలువురు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. అలాగే బస్సు ప్రమాదం నుంచి బయటపడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు