
జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి నూతనంగా విచ్చేసిన బాన్సువాడ డిఎల్పిఓ ప్రసాద్ ను గ్రామపంచాయతీ సిబ్బంది తరపున షాలువాతో సత్కరించడం జరిగింది.. అనంతరం గ్రామపంచాయతీ యొక్క రికార్డులను పరిశీలించడం జరిగింది.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల యొక్క పురోగతిని మరియు ఇంటి పనుల వసూలు యొక్క పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మరియు ఇంటి పన్ను వాసులు 100% పూర్తిచేయాలని ఆదేశించినారు.. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు వేయడం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.. వీరి వెంట గౌరవ ఎంపీడీవో శ్రీనివాస్ మరియు ఎంపీవో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు