
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 24
తర్లుపాడు మండల కేంద్రం నుండి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలో గల సీతానగులవరం బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్యపై వచ్చిన కథనంపై తర్లుపాడు ఎంపీడీఓ ఓ అన్నమ్మ వెంటనే స్పందించారు. బ్రిడ్జి పరిసరాలలో రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా పెరిగిన చెట్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయంపై దృష్టి సారించారు.దీంతో ఎంపీడీఓ ఎం. అన్నమ్మ ఆదేశాల మేరకు, సిబ్బంది ఏవో బుర్రి చంద్రశేఖర్, పంచాయితీ కార్యదర్శి టీ. సుభాకర్ బాబు వెంటనే రంగంలోకి దిగారు. ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు.చెట్లను తొలగించడం ద్వారా రోడ్డు విస్తీర్ణం పెరిగి, వాహనాల రాకపోకలకు అంతరాయం తొలగిపోయింది. అధికారుల సత్వర చర్యల పట్ల స్థానికులు, వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్య వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా రక్షణ లభించిందని వారు పేర్కొన్నారు. ఎంపీడీఓ ఓ . అన్నమ్మ తీసుకున్న ఈ చొరవ ప్రజల ప్రయాణ సౌలభ్యం, భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని మండల ప్రజలు ప్రశంసించారు.