
జీవిత సాఫల్య పురస్కారం
జనం న్యూస్): అక్టోబర్ 24
ఆర్య వైశ్య సమాజ సేవలో అగ్రగామిగా నిలిచిన కాకినాడకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సేవా తత్వవేత్త ప్రగలపాటి కనకరాజు కి విశిష్ట గౌరవం లభించింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆయనను "జీవిత సాఫల్య పురస్కారం"కి ఎంపిక చేసినట్లు సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు వి.ఎన్. డైమండ్ ఎరుకుల్ల రామకృష్ణ ప్రకటించారు. విద్యా రంగంలో ఆయన చేసిన నిరంతర కృషి, ఆర్య వైశ్య సమాజ అభ్యున్నతికి చేసిన నిస్వార్ధ సేవలు, విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రదర్శించిన అంకితభావం గమనార్హమని తెలిపారు. సమాజం పట్ల మానవతా దృక్పథం, సేవా పట్ల అంకితచిత్తం, సానుకూల మార్పుకు ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. వాసవి క్లబ్స్ సంస్థ తరపున ప్రతి సంవత్సరం సమాజానికి విశేష సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి గౌరవించడం ఒక సద్భావన కార్యక్రమంగా కొనసాగుతోందని ఎరుకుల రామకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా మానవత, సేవ, సామాజిక అభివృద్ధి పట్ల అంకితభావం కలిగిన వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ, మంగళవారం, పుదుచ్చేరి నగరంలోని శెన్బోగా హెూటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి తి.ఎన్. రంగసామి ముఖ్య అతిథిగా హాజరై పురస్కారం అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి వాసవి క్లబ్స్ ప్రతినిధులు, ఆర్య వైశ్య సంఘ ప్రముఖులు, విద్యావేత్తలు, సామాజిక సేవకులు హాజరుకానున్నారు. ఈ గౌరవం ద్వారా సమాజానికి ఆయన చేసిన సేవలు మరింత ఆదర్శంగా నిలుస్తాయని వాసవి క్లబ్స్ అంతర్జాతీయ కార్యాలయం తరఫున తెలిపారు. వాసవి క్లబ్స్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ %-% "ప్రగలపాటి కనకరాజు విద్యా రంగంలోనే కాదు, మానవతా విలువల పరిరక్షణలోనూ ఓ మార్గదర్శి, సమాజంలో నైతికత, ఆత్మీయత, సానుకూలతను నాటడంలో ఆయన కృషి విశేషం. ఇలాంటి సేవా తత్వమున్న వ్యక్తులకు గౌరవం అందించడం మా బాధ్యత మాత్రమే కాక గర్వకారణం అన్నారు. సంస్థ వివరాల ప్రకారం, ఈ గౌరవ కార్యక్రమం వాసవి క్లబ్స్, అంతర్జాతీయ సేవా దృక్పథంలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. సమాజానికి విశేష కృషి చేసిన వ్యక్తులని గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా సేవా భావాన్ని విస్తరించడం లక్ష్యంగా కొనసాగుతుంది