మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మునగాల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బాపూజీ చూపిన శాంతి బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని,అహింస మార్గమే ప్రపంచశాంతికి దోహదపడతాయన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.