
జనం న్యూస్ అక్టోబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి.
త్రిపురాంతకం.
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు.స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆలయానికి చేరుకున్న డాక్టర్ ఏలూరికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు.అనంతరం డాక్టర్ ఏలూరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి వెంట బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కె.పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు సముద్రాల మల్లికార్జున రావు, బిజెవైఎమ్ ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ జివి రెడ్డి, బిజెవైఎమ్ మండల అధ్యక్షులు బత్తుల పాలంకయ్య, త్రిపురాంతకం పట్టణ అధ్యక్షులు అన్నా గురునాధం తదితరులు పాల్గొన్నారు.