
జనం న్యూస్- అక్టోబర్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం లో కార్తీక మాసం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఆంజనేయ స్వాములకు ,అయ్యప్ప స్వాములకు కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ,హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించి ,ఆశీర్వాదం తీసుకొని చిన్ని గురు స్వామి ఆధ్వర్యంలో స్వాములకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పగడాల నాగరాజు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి , రాజగోపాల్ రెడ్డి ,మాయకోటి శంకర్, అంజి రెడ్డి ,జనార్ధన్ , యోహన్ అయ్యప్ప స్వాములు ఆంజనేయ స్వాములు తదితరులు పాల్గొన్నారు.