
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తం,తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిసర ప్రాంత ప్రజలు నందలూరు మండలంలోని బస్టాండు నుంచి నీలి పల్లెకు వెళ్లే రహదారిలో భారత్ గ్యాస్ ఆఫీసు ఇరువైపులా వర్షపు నీరు నిండి విద్యానగర్ , గణపతినగర్,తదితర ప్రాంతాలు,నివాసాల మధ్య నీరు వర్షపు నీరు ఎక్కువగా నిలబడి పోయింది, ప్రధాన కాలువ ద్వారా కన్యకచెరువు కు వెళ్ళవలసిన నీరు ప్రస్తుతం నివాసాల మధ్య చేరింది, అయితే అధికారులు వచ్చి చూసి పోతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు బహిరంగంగావిమర్శిస్తున్నారు,కాలువలలో ఇష్టాను సారంగాచెత్తా,చెదారం వేయడంతో పూడిక ఏర్పడి నీరు వెళ్లేందుకు మార్గం లేక నివాసాలలోకి వస్తున్నాయి, దీంతో ఆ రెండు వీధులు, అస్తవ్యస్తంగా తయార య్యాయి,శుక్రవారం మండల తహసిల్దార్ అమరేశ్వరి ఎంపీడీవో ప్రసాద్ డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కుమార్, నాగిరెడ్డిపల్లె పంచాయతీసర్పంచ్,సూర్యనారాయణ,కార్యదర్శి సురేష్ కుమార్, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు, సర్పంచ్ ఆధ్వర్యంలో జెసిబి ఏర్పాటు చేసి పిచ్చి మొక్కలను తొలగించారు, అయితే నీటిని తొలగిం చేందుకు కాలువ మీద ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిడ్జిలు ఆటంకం కలిగి స్తున్నాయి, ఈ సమస్యకు శాశ్వతపరిష్కారం,చేయవలసిందిగా పరిసర నివాసాల ప్రజలు కోరుతున్నారు, ఈ కార్య క్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది ,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు,