
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 25 రిపోర్టర్ సలికినీడి నాగు
చిలకలూరిపేట: పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్లో డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక గర్భిణికి పునరావృతం (Repeat) ఎలక్టివ్ Lscs (సిజేరియన్) ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.వైద్యులు ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం జరిగిన ఈ శస్త్రచికిత్స ద్వారా 3 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన ఆడ శిశువు జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, డాక్టర్ లావు సుష్మ పర్యవేక్షణలో వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి.డాక్టర్ లావు సుష్మ అనుభవం, లీలావతి హాస్పిటల్స్లో ఉన్న అత్యాధునిక సదుపాయాల వల్ల సంక్లిష్టమైన పునరావృత సిజేరియన్ కూడా సురక్షితంగా పూర్తయ్యిందని పలువురు అభినందించారు.