
నిరుపయోగంగా మరుగుదొడ్లు,మూత్రశాలలు
తాగునీరు లేక ప్రయాణికుల అవస్థలు
జగదేవపూర్ ఆర్టీసీ బస్టాండ్లో సమస్యల తిష్ఠ
వసతులు కల్పించాలంటున్న ప్యాసింజర్లు…
జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవపూర్ జగదేవపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి, మండల కేంద్రంలో ప్రయాణికుల రవాణా సౌకర్యర్థం మూడు సంవత్సరాల కిందట కొత్త బస్టాండ్ నిర్మించారు. ఈ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బస్టాండ్ లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లు మూత్రశాలలు నిరుపయోగంగా మారాయి, దీంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు , ఇది పరిశుభ్రత మరియు ఆరోగ్యం పరంగా కూడా సమస్యలను కలిగిస్తుంది,అలాగే బస్టాండ్ లో తాగునీటి సౌకర్యం లేదు, కూర్చోవడానికి బెంచీలు లేవ్వు మంచినీటి సౌకర్యం లేదు, ఎన్నో సమస్యలతో ప్యాసింజర్లు శతమాతమవుతున్నారు.జగదేవపూర్ మీదుగా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ హైదరాబాద్ సిద్దిపేట కరీంనగర్, కొండపోచమ్మ కొమురవెల్లి భువనగిరి యాదగిరిగుట్ట ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రయాణాలు చేస్తుంటారు. నియోజకవర్గంలోని దినదిన అభివృద్ధి చెందుతూ కేంద్ర బిందువైన జగదేవపూర్ మండలంలో ప్రయాణం కోసం నిర్మించబడిన బస్టాండ్ లో మాత్రం ప్రజలకు కనీస తాగునీరు కూర్చునేందుకు బెంచీలు కూడా లేని పరిస్థితి ,బస్టాండు నిర్మాణ సమయంలో నిర్మించిన మరుగుదొడ్లు మూత్రశాలలు నిర్మించి అర్ధాంతరంగా వదిలేశారు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు, అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో ప్రైవేటు వాహనదారులు ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేయడంతో బస్సులు తిరిగేందుకు వీలు లేకుండా పోయి డ్రైవర్లు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు,రాత్రి వేళల్లో మందు బాబులు మద్యం సేవించి బస్టాండ్ లో సీసలు వాటర్ ప్యాకెట్లు వేసి వెళ్తున్నారు.సంస్థకు ప్రయాణికులే దేవుళ్ళు అంటూ ప్రచారం చేసే అధికారులు బస్టాండ్ లో నెలకొన్న సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు.. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ లో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
