
జనం న్యూస్ అక్టోబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాలతో జీవీఎంసీ మలేరియా డిపార్ట్మెంట్ వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి 82 వ వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీలో కూటమి నాయకులు సమక్షంలో దోమతెరలు ప్రజలకు పంపిణీ చేశామని జనసేన నాయకులు ఆళ్ల రామచంద్రరావు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ 82 వ వార్డు ఇంచార్జ్ పోలవరపు త్రినాధ మాట్లాడుతూ మురికివాడల్లో వర్షాకాలం లో అంటూ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఇంటి ముందు కాలువలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేకపోతే మలేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని అందువలన దోమల నివారణ కోసం దోమ కాటు వాళ్ల నిద్ర భంగం కలగకుండా శాసనసభ్యులు రామకృష్ణ జీవీఎంసీ అధికారులతో మాట్లాడి దోమతెర్లను ప్రతి కుటుంబానికి అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారని త్రినాధ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాడి రామకృష్ణ అప్పికొండ గణేష్ బర్నికాన రాము టిడిపి నర్సింగ్ యాదవ్ నాయకులు కోయిలాడ గణేష్ కసిరెడ్డి వాసు ఓరుగంటి నాగమణి ముప్పిడి మణికంఠ మలేరియా డిపార్ట్మెంట్ అధికారి కోదండ రాము కూటమి నాయకులు పాల్గొన్నారు.