జనం న్యూస్ జనవరి 30(నడిగూడెం)
రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పేస్కేలు వెంటనే అమలు చేయాలని, పెండింగు వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నడిగూడెం మండల ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పంధించి ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమములో ఉపాధి హామీ ఏపీఓ, ఈసీ శ్రీనివాసు, సీఓ & ఏఏలు యన్. విజయ్, కృష్ణ, టీఏ లు సురేష్, సతీష్ ఫీల్డ్ అసిస్టెంట్స్ జంపాల వెంకన్న, స్వరూప, పద్మ, వెంకన్న, సులోచన తదితరులు పాల్గొన్నారు.