
సి పి ఎం, బి ఎల్ పి పార్టీ లు
సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ వెంకటాపూర్ గ్రామంలో చాలా రోజులుగా గ్రామ సింహాల నుంచి గ్రామ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిద్దిపేట రూరల్ మండల సెక్రెటరీ మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో చిన్నపిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో అదే విధంగా గ్రామ ప్రజలు పనులకు వెళ్లే సమయాలలో దారి మధ్యలో గ్రామ సింహాలు సుమారుగా 40 కి పైగా గ్రామంలో సంచరిస్తూ గతంలో కూడా చిన్న పిల్లలపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేకరకాల అనారోగ్య సమస్యలతో సతమత పడుతున్నారు. అంగన్వాడి సెంటర్లు, స్కూలు వద్ద పిల్లలు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురి అవుతున్నారు,కావున సంబంధిత అధికారులు వీటి విషయంలో సమస్యను పరిష్కారం చేయవలసిందిగా గ్రామ ప్రజలు కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రూరల్ మండల నాయకులు చింతల వెంకటయ్య, బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ మెదక్ జిల్లా కో కన్వీనర్ భాను ప్రకాష్, బి ఎల్ పి పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి ఆంజనేయులు, బి ఎల్ పి పార్టీ నాయకులు దబ్బెట ఆనంద్, కోటగిరి తిరుపతి, తరిగొప్పుల కోటి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
