
ఏర్గట్లలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహణ
ఏర్గట్ల, అక్టోబర్ 26 (జనంన్యూస్):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల స్మృతిని సజీవంగా ఉంచుతూ, ఏర్గట్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్సై పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా నిర్వహించారు.ఉదయం 10:30 గంటలకు ఏర్గట్ల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ, తాళ్ల రాంపూర్ శ్రీ రామాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో పోలీస్ సిబ్బంది, యువత, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.మార్గమంతా దేశభక్తి నినాదాలతో మార్మోగింది.ఈ సందర్భంగా ఎస్సై పడాల రాజేశ్వర్ మాట్లాడుతూమా పోలీస్ సిబ్బంది దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించారు. వారు నక్సలైట్లు, మత విభజన శక్తులు, నేర ముఠాలు వంటి విపత్తులను ఎదుర్కొంటూ ధైర్యంగా సేవచేశారు. వారి త్యాగాల వల్లనే ఈ రోజు మనం శాంతి, సౌఖ్యంతో జీవిస్తున్నాం” అన్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండకుండా పోలీస్ శాఖకట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ప్రజలు, పోలీస్లు ఒకే కుటుంబం — ప్రజల రక్షణే మా ధర్మం.”మేము వేసుకున్న యూనిఫాం గర్వానికి, కర్తవ్యానికి, నిస్వార్థ సేవకు ప్రతీక. దేశం కోసం, న్యాయం కోసం ఎల్లప్పుడూ తలవంచకుండా సేవ చేయడం మా డ్యూటీ అని ఎస్సై రాజేశ్వర్ తెలిపారుఈ కార్యక్రమంలో తుపాకుల శ్రీనివాస్ గౌడ్, నూతుల సుభాష్, పోలీస్ సిబ్బంది, స్థానిక యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.