
జనం న్యూస్, అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం
: మంతా తుఫాన్ తీరం వైపు దూసుకు వస్తుందని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఎస్ వెంకటాచలం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నేటి నుండి మూడు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలతో పాటు మన జిల్లాపై కూడా మంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని కావున ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు, అధికారులు పరస్పర సహకారంతో మంతా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవి కిరణ్, ఎస్ఐ అవినాష్, ఈ.ఓ.పి.ఆర్.డి, పరిపాలనాధికారి సంఘ మిత్ర, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుబ్రమణ్యం, కార్యదర్శి జెవివి సత్యనారాయణ, పలువురు కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు