
జనం న్యూస్ అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అధికారులకు సూచించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపధ్యంలో మన నియోజకవర్గం పై తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసిందనీ. "తుపానుపై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని. తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు అధికారులు చేపట్టాలని. తుపాను షెల్టర్లలో అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి అందుబాటులో ఉంచాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు అని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు జారీ చేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ( బుచ్చిబాబు)