
జనం న్యూస్ అక్టోబర్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ అభివృద్ధిని కొనసాగించేలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఆదివారం మధురానగర్ డివిజన్లో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు.ఆయనతోపాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటుందని వారి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కార్యకర్తలు నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
