
జనం న్యూస్, అక్టోబర్ 26,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 42 రోజులుగా గ్రామస్తులు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈరోజు పూడిమడక గ్రామంలో మత్స్యకారులు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పూడిమడక మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీను,చేపల శ్రీరాములు,మేరుగు చినరాజు,ఉమ్మిడి అప్పారావు,మేరుగు అప్పలరాజు,ఏరిపల్లి ముత్యాలు,పైడియ్య,భాను,రెవిడి ఆనందరావు,ఈరిగిల అప్పారావు,ఏరిపల్లి శ్రీను, మేరుగు రాజు తదితరులు పాల్గొన్నారు.